ముంపు బాధితులకు సీఎం చంద్రబాబు కనిపించలేదా? - నిరాహార దీక్ష 94వ రోజుకు

1326చూసినవారు
ముంపు బాధితులకు సీఎం చంద్రబాబు కనిపించలేదా? - నిరాహార దీక్ష 94వ రోజుకు
శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే, ఎంపీల పనితీరుకు రేటింగులు ఇస్తున్నారని, కానీ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నందికొట్కూరులో నాయకులు ఇచ్చిన హామీ మేరకు జీఓ.98 సమస్య పరిష్కారం కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 94వ రోజుకు చేరుకున్నాయి. జీఓ.98 ప్రకారం ఇళ్లు నిర్మించి, ఉచిత విద్యుత్, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయినా ఇవ్వాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని బాధితులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్