నంద్యాలలో తొలి మహిళా హెవీ వెహికల్ డ్రైవర్ లక్ష్మీదేవి

1350చూసినవారు
నంద్యాలలో తొలి మహిళా హెవీ వెహికల్ డ్రైవర్ లక్ష్మీదేవి
నంద్యాల జిల్లాలో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా లక్ష్మీదేవి అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఆమెను అభినందిస్తూ, ఇది మహిళలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్‌గా ప్రారంభించి పట్టుదలతో లారీ, బస్సు నడిపే స్థాయికి చేరడం గర్వకారణమన్నారు. లక్ష్మీదేవి ఈ ఘనత సాధించడం మహిళా సాధికారతకు నిదర్శనమని కలెక్టర్ తెలిపారు.