సంజామలలో తోలకరి జల్లులు.. ఆహ్లాదకరంగా వాతావరణం

550చూసినవారు
సంజామలలో తోలకరి జల్లులు.. ఆహ్లాదకరంగా వాతావరణం
నందికొట్కూరు నియోజకవర్గంలోని సంజామల మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో శనివారం తోలకరి జల్లులతో వర్షం కురిసింది. ఉదయం నుంచే మేఘావృతమైన వాతావరణం నెలకొనగా, పలుచోట్ల చిరుజల్లులు పడ్డాయి. ఈ వర్షంతో ఎండ తీవ్రత తగ్గి ప్రజలకు వేడి నుంచి ఉపశమనం లభించింది. ఖరీఫ్ సీజన్‌కు ఇది అనుకూలమని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తాజా వర్షపాతంతో మండలంలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్