నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రోడ్డు ఎంపీయూపీ పాఠశాల (సంత గేట్)లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొన్నారు. 0 నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు రెండు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు.