పాములపాడు మండలం ఎర్రగుడూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టడంతో కరిముల్లా, సాజిద దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తిరుపాలు తెలిపారు.