జూపాడుబంగ్లా మండలం తంగడంచ గ్రామంలో పోలీసులు భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయ పర్యవేక్షణలో ఎస్సై మల్లికార్జున సిబ్బందితో కలిసి గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ నిల్వలు, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు. అనంతరం యువతకు అవగాహన కల్పించి మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు.