నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరులో రూ. 2 లక్షల విలువైన ఎద్దులు దొంగతనానికి గురైన ఘటనలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఎస్సై మణికంఠ, పోలీసు బృందంతో గాలింపు చర్యలు చేపట్టి, నాలుగు రోజుల్లోనే దొంగిలించబడిన ఎద్దులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎద్దులను తిరిగి అప్పగించినందుకు కృతజ్ఞతగా బాధితుడు ఎస్సై మణికంఠను పూలమాలతో, శాలువాతో సత్కరించారు.