నంద్యాల: పోలీస్ పీజీఆర్ఎస్‌కు 60 ఫిర్యాదులు

169చూసినవారు
నంద్యాల: పోలీస్ పీజీఆర్ఎస్‌కు 60 ఫిర్యాదులు
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ సునీల్ షొరాణ్ 60 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై చట్టపరంగా విచారణ జరిపి న్యాయం చేస్తామని ఆయన తెలిపారు. ముఖ్యంగా మోసాలు, భూమి వివాదాలు, రుణ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను సానుభూతితో విని, సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని ఎస్పీ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్