నంద్యాల: వైసీపీ నిరసనలపై మంత్రి ఫరూక్ విమర్శలు

2352చూసినవారు
వైసీపీ నాయకుల నిరసన కార్యక్రమాలపై మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తీవ్రంగా స్పందించారు. ఎద్దుల బండ్లు, గాడిదలతో నిరసనలు చేపట్టడం, ఆందోళనల్లో డాన్సులు చేయడం వారి రాజకీయ సంస్కారానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారినే గాడిదపై ఊరేగిస్తారని, గాడిదలతో నిరసనలు చేపట్టడం చూస్తుంటే వారే తమ తప్పులను ఒప్పుకుంటున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం జగన్‌ను కుంభకర్ణుడితో పోల్చిన ఆయన, పనిపాట లేక డీఎస్సీ అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్