నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, ప్రజా ఫిర్యాదులను గడువులోగా, అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని పీజీఆర్ఎస్ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో, జిల్లాలో ఇప్పటివరకు 66,536 అర్జీలు స్వీకరించగా, 61,710 పరిష్కరించినట్లు తెలిపారు. రీఓపెన్ అయిన అర్జీలు, సీఎం కార్యాలయం నుంచి వచ్చిన వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.