నంద్యాల: అంబటిపై దాడిని ఖండించిన వైఎస్ఆర్సీపీ నేతలు

464చూసినవారు
నంద్యాల: అంబటిపై దాడిని ఖండించిన వైఎస్ఆర్సీపీ నేతలు
నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు కాటసాని రామభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా పాల్గొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై, పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో సుపరిపాలన కాకుండా రెడ్‌బుక్ పాలన సాగుతోందని, టీడీపీ రౌడీ మూకల దాడులపై పోలీసులు మౌనంగా ఉన్నారని ఆరోపించారు. అన్ని రోజులు ఒకేలా ఉండవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్