నందికొట్కూరు పట్టణంలోని ఏబీఎం పాలెం లో బుధవారం టిడిపి సీనియర్ నాయకులు నిమ్మకాయల మోహన్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు వితంతు, వికలాంగుల, వృద్ధాప్య పెన్షన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ కూడా పాల్గొన్నారు.