జూపాడుబంగ్లా మండలం భాస్కరాపురంలో పోలీసులు సైబర్ నేరాలు, గంజాయి, డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొబైల్‌కు వచ్చే ఏపీకే (APK) ఫైళ్లు, అనుమానాస్పద లింకులను తెరవొద్దని ఎస్‌ఐ మల్లికార్జున ప్రజలను హెచ్చరించారు. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్, సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉంటే సైబర్ మోసాలను నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు.