నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. రద్దీ ప్రాంతాలు, ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వాడాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ తనిఖీలు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని చేపట్టారు.