కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్: ఎమ్మెల్యేకు వినతి

1216చూసినవారు
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్: ఎమ్మెల్యేకు వినతి
నంద్యాల, నందికొట్కూరు ప్రాంతాల్లోని వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ బుధవారం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యను కలిశారు. రేడియోగ్రాఫర్ నాగ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేసిన ఉద్యోగులు, తాము కొన్నేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నామని, తమ రెగ్యులరైజేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్