ప్రభుత్వ భవనంలో మద్యం విందుపై విచారణ కోరిన శిల్పా రవి

1798చూసినవారు
నూనెపల్లిలోని ప్రభుత్వ కార్యాలయ భవనంలో టీడీపీ నాయకుడు మద్యం విందు నిర్వహించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి స్పందించారు. ప్రజల సేవల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ భవనాలను ఇలాంటి కార్యకలాపాలకు ఉపయోగించడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్