నందికొట్కూరు పట్టణంలో శ్రీశైలం నీటి ముంపు నిర్వాసితుల రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 95వ రోజుకు చేరుకున్నాయి. జీఓ.98 ప్రకారం
ఉద్యోగాలు భర్తీ చేయాలని బాధితులు జయన్న డిమాండ్ చేశారు. తమ భూములను త్యాగం చేసినా, తినడానికి తిండి లేక, ఎండ, వాన, దుమ్ముతో దీక్షలు చేస్తున్న తమను పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ 32 మంది మృతి చెందారని, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణ, నాగేంద్ర, జమ్మన్న, మురళీ పాల్గొన్నారు.