రాయలసీమ రైతుల త్యాగం కూడా గొప్పదే: జయన్న

854చూసినవారు
రాయలసీమ రైతుల త్యాగం కూడా గొప్పదే: జయన్న
నందికొట్కూరు పట్టణంలో ముంపు బాధితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ముంపు నిర్వాసిత, నిరుద్యోగి జయన్న మాట్లాడుతూ, రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులది త్యాగమైతే, శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చి, జల విద్యుత్ ఉత్పత్తి చేసి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వెలుగు నిచ్చిన, ఇతర రాష్ట్రాలకు సాగు, తాగునీరు ఇచ్చిన రాయలసీమ ప్రాంత రైతులది కూడా త్యాగమేనని అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆనాడు మానవ దృక్పథంతో ఇచ్చిన జీఓ 98 ను నేడు అమలు చేయకపోవడం శోచనీయమని, ఇప్పటికైనా దానిని అమలు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్