నందికొట్కూరులో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం

352చూసినవారు
నందికొట్కూరులో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు నిరసనగా నందికొట్కూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దారా సుధీర్ నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి పటేల్ కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం జరిగిన సభలో ఎన్నికల హామీలు అమలు కాలేదని, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్