నూతన మహిళ చట్టాలపై అవగాహన

2771చూసినవారు
నూతన మహిళ చట్టాలపై అవగాహన
నంద్యాల ఎన్జీవోఎస్ కాలనీలోని నలంద జూనియర్ కాలేజ్ బాలికల వసతి గృహంలో ఆదివారం  శక్తి టీం సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నూతన మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మారుతున్న సమాజంలో చట్టాలపై అవగాహన చేసుకోవాలని, ఆపదలో శక్తి యాప్ ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరించారు. అత్యవసర నంబర్లు 112, 100, సైబర్ క్రైమ్ 1930, చైల్డ్ వెల్ఫేర్ 1098, వుమన్ వెల్ఫేర్ 181 గురించి తెలియజేశారు. వన్ స్టాప్ సెంటర్ ప్రాముఖ్యతను కూడా వివరించారు.

సంబంధిత పోస్ట్