నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్ వెంకటేశ్వర్లు, ఎంఈఓ 2 జయరాజ్ సోమవారం మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు 'నో టచ్' గురించి వివరించారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని, పోక్సో చట్టం వర్తిస్తుందని హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే తినుబండారాలు తీసుకోకూడదని, ఒంటరిగా వారి దగ్గరికి వెళ్లకూడదని సూచించారు. అత్యవసర నంబర్లు 100, 112 గురించి తెలియజేసి, శక్తి టీం పనితీరును వివరించారు. అక్కడి ఉపాధ్యాయుల సెల్ ఫోన్లలో శక్తి యాప్ డౌన్లోడ్ చేయించారు.