నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది, రాజశ్రీ ఎస్పీ, అడిషనల్ ఎస్పీల ఆదేశాల మేరకు నంద్యాల మండలం ఉడుమాలపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ఒకటవ తరగతి నుండి 5వ తరగతి వరకు గల విద్యార్థినిలకు 'నో టచ్' (తాకవద్దు) గురించి అవగాహన కల్పించారు. అత్యవసర కాల్ నంబర్లు 112, 100 గురించి తెలియజేశారు. గుర్తు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, వారు పిలిచినా వెళ్లరాదని, వారు ఇచ్చే తినువస్తువులు తినరాదని సూచించారు.