నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్, సిబ్బందితో కలిసి గురువారం బండి ఆత్మకూరు మండలం ఈర్ణపాడు గ్రామంలోని మండల పరిషత్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఎదురైనప్పుడు ఎలా మెలగాలి, వారు ఏమైనా చేస్తే దగ్గరలో ఉన్నవారిని కేకలతో పిలవాలి, తాగుబోతులకు దూరంగా ఉండాలి, ఏదైనా ఆపద ఉంటే 100 లేదా 112కు కాల్ చేయాలని సూచించారు.