కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో "2 ఏళ్ల నమ్మకం. అభివృద్ధి. సంక్షేమం" పేరుతో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కూటమి పాలనపై ప్రజల విశ్వాసం మరింత బలపడిందని వారు పేర్కొన్నారు.