మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ఈగల్ టీం అవగాహన

974చూసినవారు
మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ఈగల్ టీం అవగాహన
నంద్యాల జిల్లా ఈగల్ టీం ఆధ్వర్యంలో కానిస్టేబుల్స్ మనోహర్, ప్రసాద్ నందమూరి నగర్ లో ప్రజలకు మత్తు పదార్థాల వల్ల కలిగే హాని గురించి అవగాహన కల్పించారు. గంజాయి, గుట్కా వంటివి సేవించడం వల్ల క్యాన్సర్ బారిన పడతారని, ఎవరైనా మత్తు పదార్థాల అలవాట్లు మానుకోలేకపోతే 1972 కు తెలియజేస్తే నంద్యాల గవర్నమెంట్ ఆసుపత్రిలోని డి-అడిక్షన్ సెంటర్ లో చేర్చుకుంటామని తెలిపారు. ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్