నంద్యాలలో 10వ తరగతి సమాధాన పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మూల్యాంకనంలో భాగంగా మొత్తం 1.86 లక్షల పత్రాలను 14 గదుల్లో పరీక్షిస్తున్నారు. కలెక్టర్ రాజకుమారి ఈ మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించి, భద్రతా ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పించిన సదుపాయాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు. మార్కుల కేటాయింపులో ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా, అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని పరీక్షకులను ఆమె ఆదేశించారు.