అసంపూర్తి భవనాలకు నిధులు మంజూరు చేయాలి

2853చూసినవారు
అసంపూర్తి భవనాలకు నిధులు మంజూరు చేయాలి
బండిఆత్మకూరులోని శింగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వం మంజూరు చేసిన తరగతి గదుల నిర్మాణం నిధుల కొరతతో మధ్యలోనే ఆగిపోయింది. దీనితో విద్యార్థులు ఇరుకైన ప్రదేశంలో విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలకు ప్రహరీగోడ లేకపోవడంతో రాత్రుళ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతోందని ఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గోర్ల సుధాకర్ తెలిపారు. అసంపూర్తి భవనాలకు నిధులు మంజూరు చేసి పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్