నంద్యాలలో గాంధీ వర్ధంతి: రైతు సమాఖ్య ఆధ్వర్యంలో నివాళులు

421చూసినవారు
నంద్యాలలో గాంధీ వర్ధంతి: రైతు సమాఖ్య ఆధ్వర్యంలో నివాళులు
నంద్యాల పట్టణంలో శుక్రవారం నంది రైతు సమాఖ్య ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కాదర్ బాద్ రవీంద్రనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్వాతంత్రోద్యమ కాలంలో తన తండ్రి కాదరబాద్ నర్సింగరావు, మహాత్మా గాంధీ నంద్యాల పర్యటనకు వచ్చినప్పుడు జన సమీకరణ, బహిరంగ సభ ఏర్పాట్లు చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్