నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం సిబ్బంది, హెడ్ కానిస్టేబుల్ డి.ఎన్. ప్రసాద్, వెంకటేశ్వర్లు, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, మహిళా పోలీస్ సునీత, లీగల్ అడ్వైజర్ హారిక, నంద్యాల మండలం చాబోలు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు శక్తి యాప్ గురించి వివరించారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించి, అమ్మాయిలు, మహిళల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే శక్తి యాప్ నంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తామని తెలిపారు. సైబర్ నేరాలపై 1930కి ఫోన్ చేయాలని సూచించారు.