నంద్యాల జిల్లా ప్రారంభమైన జనసేన పార్టీ నిర్మాణ సారథుల కమిటీ

2741చూసినవారు
నంద్యాల జిల్లా ప్రారంభమైన జనసేన పార్టీ నిర్మాణ సారథుల కమిటీ
నంద్యాల పార్లమెంట్‌లో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమైంది. నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు శ్రీ వల్లభనేని బాలశౌరి నేతృత్వంలోని 28 మంది సభ్యుల బృందం నంద్యాల - క్రాంతి నగర్ లోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో జనసేన పార్టీ నాయకుల నుండి దరఖాస్తులు స్వీకరించింది. పార్టీ కమిటీల్లో బాధ్యతలు స్వీకరించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న నాయకులు, వీర మహిళలు, జనసేన సాధకులు, జనసైనికుల నుండి జూన్ 29 నుండి జూలై 3 వరకు దరఖాస్తులు సేకరించి, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నంద్యాల జిల్లాలో ప్రారంభమైంది.

సంబంధిత పోస్ట్