నంద్యాల పట్టణంలోని జ్ఞానాపురం నేషనల్ ఐటీఐ కళాశాలలో ఈ నెల 16న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి సోమశివరెడ్డి తెలిపారు. ఈ మేళాలో అపోలో, ఇండక్ట్ కంపోసైట్స్ వంటి పలు సంస్థలు పాల్గొంటాయి. ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, బీ ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 28 ఏళ్లలోపు అభ్యర్థులు తమ విద్యార్హతల ధ్రువపత్రాలు, ఫొటోలతో హాజరుకావాలని సూచించారు. ఈ ఉద్యోగ మేళా ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.