నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలో 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు మూలే రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూలే రామేశ్వర్ రెడ్డి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.