నంద్యాల జిల్లా భీమునిపాడులో పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో భారీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కోయిలకుంట్ల సీఐ హనుమంత్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించి, మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు.