మీర్జాపురం తాగునీటి సరఫరా పునరుద్ధరణ: ప్రజలకు ఊరట

1165చూసినవారు
మీర్జాపురం తాగునీటి సరఫరా పునరుద్ధరణ: ప్రజలకు ఊరట
మీర్జాపురం గ్రామంలో తాగునీటి మోటార్లు కాలిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారులు వెంటనే స్పందించి మోటార్లను మరమ్మతులు చేసి, తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. ఆర్&బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాలు, కొలిమిగుండ్ల మండల టీడీపీ అధ్యక్షుడు మూలె రామేశ్వర్ రెడ్డి సహకారంతో, యువ నాయకుడు వేణు యాదవ్ చొరవతో ఈ సమస్య పరిష్కారమైంది. దీంతో ఈ ఉదయం నుంచి గ్రామంలో తాగునీటి సరఫరా తిరిగి ప్రారంభమై ప్రజలకు ఊరట లభించింది.

సంబంధిత పోస్ట్