గోస్పాడు మండలం పసురపాడు సచివాలయంలో కలెక్టర్ రాజకుమారి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ మద్యం మత్తులో విధులకు హాజరైనట్లు ఆమె గుర్తించారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలో ఆల్కహాల్ స్థాయి నమోదవడంతో, కలెక్టర్ ఆదేశాల మేరకు సదరు సెక్రటరీని వెంటనే సస్పెండ్ చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.