నంద్యాలలో చంద్రబాబు నాయుడుపై అభిమానంతో బండ్ల గణేష్ చేపట్టిన సంకల్పయాత్ర గురువారం నంద్యాలకు చేరుకుంది. అక్రమ అరెస్టు జరిగిన ప్రదేశానికి కాలినడకన చేరుకోవడం భావోద్వేగానికి గురి చేసిందని ఆయన తెలిపారు. ఈ యాత్రకు సంఘీభావంగా టీడీపీ నేత ఫయాజ్ నేతృత్వంలో పలువురు నాయకులు ఘన స్వాగతం పలికారు.