ఐడిఏ రాయలసీమ బ్రాంచి అధ్యక్షుడు, నంద్యాల పట్టణానికి చెందిన డాక్టర్ కిషోర్ కుమార్ జాతీయ దంత వైద్యుల పురస్కారానికి ఎంపికయ్యారు. ఫిబ్రవరి 7వ తేదీన మంగళూరులో జరుగనున్న 76వ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ జాతీయ స్థాయి దంత వైద్య సదస్సులో ఆయన ఈ పురస్కారం అందుకోనున్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని వైద్యులు, ప్రముఖులు డాక్టర్ కిషోర్ కుమార్ కు అభినందనలు తెలిపారు.