నంద్యాల: ట్రాక్టర్ టైర్ కిందపడి వ్యక్తి మృతి

52చూసినవారు
నంద్యాల: ట్రాక్టర్ టైర్ కిందపడి వ్యక్తి మృతి
నంద్యాల మండలం అయ్యలూరు గ్రామానికి చెందిన శంకర్ (45) ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ పెద్దకొట్టాల గ్రామం సమీపంలో అదుపుతప్పి బోల్తా పడటంతో మృతి చెందాడు. ట్రాక్టర్‌పై నుంచి కిందపడి టైర్ కింద పడటంతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్