ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైకాపా నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 36వ వార్డు వై జంక్షన్‌లో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టీడీపీ యువ నాయకులు గౌరు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబటి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం, ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు ర్యాలీ నిర్వహించి, అంబటిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.