బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకుండా అర్జీలు పరిష్కరించాలి: కలెక్టర్

896చూసినవారు
బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకుండా అర్జీలు పరిష్కరించాలి: కలెక్టర్
నంద్యాల కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ సమీక్షలో కలెక్టర్ రాజకుమారి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల అర్జీలను నాణ్యతతో, నిర్దేశిత గడువులోపు పరిష్కరించి, బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకుండా చూడాలని సూచించారు. రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ ద్వారా 304, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా 148 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్