పిల్లలకు అపరిచితుల పట్ల అప్రమత్తత: పోలీసుల సూచనలు

1011చూసినవారు
పిల్లలకు అపరిచితుల పట్ల అప్రమత్తత: పోలీసుల సూచనలు
నంద్యాల సబ్ డివిజనల్ శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ వెంకటేశ్వర్లు, మహిళా పోలీస్ లక్ష్మీదేవి మహానంది మండలం అల్లినగరం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శనివారం అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తులు లేదా ఇతరులు మిమ్మల్ని పిలుచుకుపోవాలని చూస్తే వెంటనే ఉపాధ్యాయులకు చెప్పాలని, వారి వెంట మోటార్ సైకిల్ పై వెళ్లకూడదని సూచించారు. అనుమానం వస్తే వెంటనే 100 లేదా 112 కు కాల్ చేయాలని తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు తెలియకుండా బయటికి వెళ్లకూడదని కూడా సూచించారు.

సంబంధిత పోస్ట్