నంద్యాల సబ్ డివిజన్ శక్తి టీం, నంద్యాల డిస్ట్రిక్ట్ ఈగల్ టీం హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ రఫీ, ఈగల్ టీం సభ్యులు మనోహర్, గాజులపల్లె గ్రామంలోని శాంతినికేతన్ హై స్కూల్లో విద్యార్థులకు మత్తు పదార్థాలు, గుట్కా, సిగరెట్లు, గంజాయి వంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటికి దూరంగా ఉండాలని గురువారం సూచించారు. మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చదువుపై శ్రద్ధ పెట్టాలని అవగాహన కల్పించారు.