0-5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి ఆదివారం పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. కేవలం రెండు చుక్కలతో పోలియో నుంచి జీవితాంతం రక్షణ పొందవచ్చని అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు తమ సమీపంలోని పోలియో బూత్, అంగన్‌వాడీ కేంద్రం లేదా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి చిన్నారులను తీసుకెళ్లి ఉచితంగా పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు.