నంద్యాల మిడ్ టౌన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పీ.వీ. నరసింహారావు జయంతి వేడుకలు ఆదివారం నంద్యాల పట్టణంలో ఘనంగా జరిగాయి. పీవీ నంద్యాల పార్లమెంట్ సభ్యునిగా ప్రాతినిధ్యం వహించి, బ్రాడ్ గేజ్ రైల్వే, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి విశిష్ట సేవలు అందించారని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.