నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గోరుమను పల్లె గ్రామంలో గ్రామ దేవత పెద్దమ్మ తల్లికి పూజలు చేస్తున్న బోయ సుధాకర్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కొలిమిగుండ్ల మండల అధ్యక్షుడు మూలే రామేశ్వర రెడ్డి, గోరుమను పల్లె గ్రామానికి వెళ్లి బోయ సుధాకర్ మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.