ఓర్వకల్లు రాక్ గార్డెన్లో 'రణబలి' సినిమా చిత్రీకరణ ఉత్సాహంగా జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్నారు. ప్రస్తుతం విలన్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్‌కు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.