బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించారు. న్యాయపరమైన సమస్యలను సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను సావధానంగా ఆలకించి, తక్షణ పరిష్కారానికి కృషి చేశారు.