నంద్యాలలో, ఉద్యోగుల పునర్విభజనను పారదర్శకంగా నిర్వహించాలని, నూతన జిల్లాలకు ఉద్యోగులను కేటాయించేటప్పుడు ST నిష్పత్తిని ఖచ్చితంగా పాటించాలని ఎస్టీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు డీఈవో కార్యాలయంలో డీఈవో, డిప్యూటీ డీఈవోలకు వినతిపత్రం గురువారం సమర్పించారు. ఎస్టీటీఎఫ్ ప్రతిపాదనలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందించారు.