నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు ఫయాజ్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యమని, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.