ఉమ్మడి కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. జిల్లాలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసి పార్టీ బలాన్ని చాటాలని ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్, పాణ్యం జనసేన ఇంచార్జి చింతా సురేష్ బాబు పిలుపునిచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలు ఈరోజు, రేపు సభ్యత్వాల నమోదును వేగవంతం చేయాలని ఆయన కోరారు.